PM Surya Ghar Yojana: పేదలకు ఉచిత విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కీలక పథకాన్ని ప్రకటించింది. కరెంట్ అవసరాలు రోజురోజుకు పెరిగిపోతుండడంతో విద్యుత్ బిల్లు తడిసి మోపెడవుతోంది. ఈ నేపథ్యంలో వారికి ఆ భారాన్ని తగ్గించేందుకు ‘పీఎం సూర్య ఘర్: ముప్త్ బిజిలి యోజన’ అనే పథకాన్ని తీసుకొచచారు. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడమే దీని లక్ష్యం. ఇందు కోసం రూ.75.021 కోట్ల వ్యయం కావడంతో దానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం వివరాల్లోకి వెళితే..
మీ సేవ కేంద్రాల్లో..
‘పీఎం సూర్య ఘర్: ముప్త్ బిజిలి యోజన’ పథకం ద్వారా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను పొందవచ్చు. అయితే ముందుగా ఇందుకు అర్హత సాధించాలి. ఈ పథకం లబ్ధి పొందాలంటే సమీపంలోని మీ సేవ కేంద్రాల్లోకి వివరాలు సమర్పించాలి. వివరాల ద్వారా అర్హత సాధించిన తరువాత సంబంధిత అధికారులు ఎంక్వైరీ చేస్తారు. ఆ తరువాత ఉచిత విద్యుత్ అందించడానికి లైన్ క్లియర్ చేస్తారు. అయితే ఈ ఉచిత విద్యుత్ రూప్ టాఫ్ సోలాన్ ప్యానెల్ ద్వారా పొందుతారు.
విద్యుత్ వాడకుంటే డబ్బులు వాపస్..
అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి కిలో వాట్ వ్యవస్థకు రూ.30 వేలు, 2 కిలో వీట్లకు రూ.60 వేలు, 3 కిలో వాట్లకు రూ.78 వేలు సాయం అందించుంది. ఇంటిపై రూప్ టాప్ సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయి గృహ అవసరాలు తీర్చుకోవచ్చు. ఇక్కడ ఆలోచించాల్సిందేమిటంటే.. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 300 యూనిట్ల కంటే తక్కువ వినియోగించుకుంటే మిగిలిని విద్యుత్ కు డబ్బులు కూడా చెల్లిస్తారు.
ఇలా అప్లై చేయాలి..
కేంద్ర ప్రభుత్వం ముందుగా కోటి ఇళ్లపై వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీని ప్రయోజనం పొందాలంటే సమీపంలోని మీసేవ కేంద్రాల్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. లేదా www.pmsuryaghar.gov.inఅనే వెబ్ సైట్ ద్వారా వివరాలు అందించి చెక్ చేసుకోవచ్చు. పీఎం సూర్య ఘర్ ముప్త్ బిజిలీ యోజన పొందాలంటే ముందుగా ఇంటిపై సోలార్ ప్యానెట్లను ఇన్ స్టార్ చేసుకోవాలి. 3kW ఉన్న వాటిని ఇన్ స్టాల్ చేసుకోవడానికి బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కూడా ఉంది.వీటిపై 7 శాతం వడ్డీతో అందిస్తున్నారు.
ఏమేం అవసరం ఉంటాయంటే?
ఈ పథకం కోసం ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంకు ఖాతా పాస్ బుక్, ఈమెయిల్ లాంటివి అవసరం పడుతాయి. ఈ సోలార్ ప్యానెల్ అమర్చుకోవడానికి 35 గజాల స్థలం కావాలి.