వేములవాడ, జనతా న్యూస్: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 18% ఉన్న జీఎస్టీని 12 శాతానికి కుదిస్తుందని చెప్పారు. 105 రూపాయల పెట్రోల్ ని 60 70 రూపాయల లోపు అందిస్తామని కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అన్నారు.వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో అనంతరం జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. నా తండ్రి జగపతిరావుకు మేడిపల్లి మండలంతో మంచి అనుబంధాలు ఉన్నాయని నా తండ్రి స్ఫూర్తిగా నేను ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేశానని, తనను గెలిపిస్తే మేడిపల్లిని కోహినూర్ గా మారుస్తానని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్, దేశంలో మోడీ అబద్ధాలకోరు అని, రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. . ప్రతి జన్ దన్ ఖాతాలో 15 లక్షలు సొమ్ము ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. సమాధానం చెప్పిన తర్వాతే బిజెపి అభ్యర్థులు ఓట్లు అడగండి అని అన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరన్నర పాటు రైతులు ధర్నాలు చేస్తే బిజెపి పట్టించుకోలేదని, 750 మంది రైతు ప్రతినిధుల మరణాలకు కారణమైన బిజెపిని ఇంటికి పంపిద్దామని అన్నారు. ఒకసారి బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎస్సీ ఎస్టీ, బిసి, మైనారిటీ తో పాటు అనగారిన వర్గాలను అవమానపరిచేందుకు సిద్ధంగా ఉంది.. కావున ప్రతి ఒక్కరు గమనించండని చెప్పారు. బండి సంజయ్ కనీసం 10 తరగతి కూడా పాస్ కాలేదని, చదువు ఒక్కటే లేదనుకుంటే సంస్కారం కూడా లేని వ్యక్తి బండి అని విమర్శించారు. ఏ శాఖలో ఎవరు పని చేస్తారో కూడా తెలియనంత సన్నాసి బండి సంజయ్ అని అన్నారు. ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపించి ఢిల్లీకి పంపిస్తే రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుందాం అని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెట్రోల్ ధరలు తగ్గుతాయి: కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు
- Advertisment -