బాధిత బాలికల ఆందోళన..ఫిజికల్ టీచర్ సస్పెండ్..
సిరిసిల్ల-జనత న్యూస్
పీఈటీ తమను వేధింపులకు గురి చేస్తుందని ఆరోపిస్తూ సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గిరిజన గురుకుల విద్యార్థులు రోడ్కెక్కారు. తమను అనవసరంగా కొడుతోందని, బాత్ రూం లలో వీడియోలు తీస్తోందని బాలికలు ఆందోళనలకు దిగారు. సిద్దిపేట రహదారిపై ఉదయం బైఠాయించి ఆందోళన చేపట్టడంతో, పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సదరు పీఈటీ ఫోన్‌ను పోలీసులు పరిశీలించారు. తాము బాత్‌రూంలో ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నారని, పీఈటీ జోష్ణపై తీవ్ర ఆరోపనలు చేయడంతో పోలీసులు ఆమె ఫోన్‌ను క్షున్నంగా పరిశీలించారు. కాగా.. ప్రిన్సిపాల్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపడంతో వారు పీఈటీపై చర్యలకు ఆదేశించారు. దీంతో పీఈటీ జోష్ణను విధుల నుండి తొలగిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రకటించారు. విద్యా సంస్థల్లో పోలీసు శాఖ చేపట్టిన చైతన్య కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయనే దానికి బాలికల నిరసనే ఉదాహారణ. నిర్భయంగా పోలీసు అధికారులతో పాటు ఉన్నతాధికారులకు పీఈటీ వేధింపులను వివరించడం పట్ల బాలికలను పలువురు అభినందిస్తున్నారు.
గురుకులంలో పీఈటీ వేధింపులు..

- Advertisment -