Saturday, March 14, 2026

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం: మంత్రి కొండా సురేఖ

వరంగల్, జనతాన్యూస్:తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తామని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ అన్నారు. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా శుక్రవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 19 డివిజన్ భగతసింగ్ నగర్ లో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అధికారులతో కలిసి శ్రీమతి కొండా సురేఖ ‘మహాలక్ష్మీ పథకం’ ‘గృహ జ్యోతి’ పథకాలను లాంఛనంగా ప్రారంభించి లబ్దిదారునికి 200 యూనిట్ల జీరో బిల్లును అందించారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ గత మంగళవారం ముఖ్యమంత్రి చేతులమీదుగా మంత్రులతో కల్సి రాష్ట్ర స్థాయిలో మహాలక్ష్మీ పథకం’ ‘గృహ జ్యోతి’ పథకాలను ప్రారంభించుకోగా నేడు జిల్లా కేంద్రాల్లో మంత్రులచే ప్రారంభించు కొంటున్నామని అన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల ఇళ్లలో వెలుగులు నింపాలనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని, అలాగే మహాలక్ష్మీ పథకం కింద  బ్జిడీతో రూ.500 సిలిండర్‌ అందిస్తున్నామని అన్నారు. గృహ జ్యోతి పథకం క్రింద వరంగల్ తూర్పు నియోజక వర్షంలోనిని లక్ష 45 వేల మంది, మహాలక్ష్మీ పథకం కింద లక్ష 50 వేల మందికి లబ్ది చేకూరుతున్నదని తెలిపారు.
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్లకే ఈ పథకాలు వర్తిస్తాయని, ఇది నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తు చేసుకొని వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎన్పిడిసిఎల్ డైరెక్టర్ మోహన్ దాస్, ఎస్ ఈ మధుసూదన్, జిల్లా పౌర సరఫరా, విద్యుత్, రెవిన్యూ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page