జమ్మికుంట, జనతా న్యూస్: తొమ్మిది సంవత్సరాల దొరల పాలన అంతం విజేయవంతం చేయడానికి ప్రజలు, నాయకులు కార్యకర్తలు తరలి వచ్చి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి పిలుపు నిచ్చారు. జమ్మికుంట పట్టణంలో బుధవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో లక్ష మందితో రేపు కాంగ్రెస్ విజయభేరీ బహిరంగగా సభ ఉంటుంది అని, బహిరంగ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరవుతారు అని అన్నారు.ఈ నెల 30న జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.అమలు కానీ హామీలు ఇచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని, గ్యాస్ సిలిండర్ ధరలు బిజెపి పెంచిందని బై ఎలక్షన్ లోహరీష్ రావు మాట్లాడిండని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పగానే
400లకే మేమిస్తామని బిఅరెస్ వాళ్ళు అంటున్నారన్నారు.దేశ చరిత్రలో మొదటి సారి
2004లో ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ,స్వర్గీయ ys రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారని,ఆనాడు ఏకకాలంలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న, జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి సలీం, బీసీ సెల్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, దాసరి సంఘం జిల్లా అధ్యక్షులు దాస్యం సత్యం, యూత్ కాంగ్రెస్ నాయకులు పనికిల శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు గారంపల్లి సంతోష్, మేకల రామస్వామి, కాగితం శ్రీనివాస్ పాల్గొన్నారు..