మంథని జనతా న్యూస్: రతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన దేశంలో ఇప్పటికీ రాజకీయ పరిణతి పెరగలేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. మంగళవారం మంథనిలో జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఎన్నో అబద్ధాలు అబండాలు పనికిమాలిన ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుండడం చాలా బాధ కలిగిస్తుంది అన్నారు. ఇవన్నీ అధికమించాలంటే దేశంలో రాజకీయ పరిణతి పెరగాలని ప్రజాస్వామ్య విలువలు పెరగాలని ఆయన తెలిపారు. ఎన్నికలు వస్తాయి పోతవి నాయకులు గెలుస్తారు ఓడుతారు కానీ ప్రజలు మాత్రం గెలవడం లేదని అది చాలా బాధ కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి పనులపై సంక్షేమ పథకాలపై గ్రామ గ్రామాల్లో చర్చలు జరగాలని ఆయా ప్రజలను కోరారు. బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం అని తెలంగాణ ప్రజల హక్కుల కోసం అని తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసమని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు కాంగ్రెస్ ను గెలిపిస్తే రాష్ట్రంలో మళ్ళీ తిరిగి దళారుల రాజ్యం వస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. 14 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో చిత్తశుద్ధి నిబద్ధతతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించని అనేక పథకాలు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టి అమలుపరిచామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓపెన్ గా చెప్తున్న విషయాలు ప్రజలు గ్రహించాలని ఆయన కోరారు. ముఖ్యంగా రైతులకు మూడు గంటలు మాత్రమే కరెంటు ఇస్తామని రైతుబంధు అవసరం లేదని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ చెబుతున్న విషయాలను ప్రజలు గ్రహించాలని ఆయన కోరారు. ధరణిని తొలగిస్తే రైతులకు ఏ విధంగా రైతుబంధు రైతు బీమా ఇస్తారని ఆయన ప్రశ్నిస్తూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ మళ్ళీ తిరిగి పహానిలు పాస్ పుస్తకాలు చెల్లించడానికి లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయం గురించి ఏమాత్రం అవగాహన లేని రాహుల్ గాంధీ ఇలా ప్రకటించడాన్ని ఆయన ఎత్తి చూపారు. గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 1000 రూపాయలు చేశామని అనంతరం 2000 పెంచామన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మార్చి నుండి 3000 చెల్లిస్తామని ఏడాదికి 500 చొప్పున 5000 రూపాయలు చెల్లించే బాధ్యతను తీసుకుంటాను అన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సాధించిందని ఎందుకు నిదర్శనంగా రాష్ట్రంలో మూడు కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని ఆయన తెలిపారు రాబోయే కాలంలో నాలుగు కోట్ల టన్నులకు పెంచి ఆలోచనలో ఉన్నామన్నారు. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అందులో భాగస్వామిగా పుట్ట మధును గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదేనని ఆయన ప్రజలకు సూచించారు. మంథని ప్రాంతానికి సంబంధించిన సమస్యలపై పుట్ట మధుకు పూర్తి అవగాహన ఉందని ఆయన తెలుపుతూ మధు ని గెలిపించాక ఒకరోజు మంథనిలో ఉండి 1000 కోట్ల విధులు కేటాయించి అన్ని రకాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఆయన స్పష్టం చేశారు. వచ్చి 75 సంవత్సరాలు గడిచిన దేశంలో ఇప్పటికీ రాజకీయ పరిమితి పెరగలేదని ప్రజలే మాకు బాసులని మాకు బాసులు అనేవారు ఎవరు లేరని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం మంథనిలో జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఎన్నో అబద్ధాలు అబండాలు పనికిమాలిన ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుండడం చాలా బాధ కలిగిస్తుంది అన్నారు. ఇవన్నీ అధికమించాలంటే దేశంలో రాజకీయ పరిణతి పెరగాలని ప్రజాస్వామ్య విలువలు పెరగాలని ఆయన తెలిపారు. ఎన్నికలు వస్తాయి పోతవి నాయకులు గెలుస్తారు ఓడుతారు కానీ ప్రజలు మాత్రం గెలవడం లేదని అది చాలా బాధ కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి పనులపై సంక్షేమ పథకాలపై గ్రామ గ్రామాల్లో చర్చలు జరగాలని ఆయా ప్రజలను కోరారు. బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం అని తెలంగాణ ప్రజల హక్కుల కోసం అని తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసమని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు కాంగ్రెస్ ను గెలిపిస్తే రాష్ట్రంలో మళ్ళీ తిరిగి దళారుల రాజ్యం వస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. 14 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో చిత్తశుద్ధి నిబద్ధతతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించని అనేక పథకాలు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టి అమలుపరిచామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓపెన్ గా చెప్తున్న విషయాలు ప్రజలు గ్రహించాలని ఆయన కోరారు. ముఖ్యంగా రైతులకు మూడు గంటలు మాత్రమే కరెంటు ఇస్తామని రైతుబంధు అవసరం లేదని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ చెబుతున్న విషయాలను ప్రజలు గ్రహించాలని ఆయన కోరారు. ధరణిని తొలగిస్తే రైతులకు ఏ విధంగా రైతుబంధు రైతు బీమా ఇస్తారని ఆయన ప్రశ్నిస్తూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ మళ్ళీ తిరిగి పహానిలు పాస్ పుస్తకాలు చెల్లించడానికి లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయం గురించి ఏమాత్రం అవగాహన లేని రాహుల్ గాంధీ ఇలా ప్రకటించడాన్ని ఆయన ఎత్తి చూపారు. గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 1000 రూపాయలు చేశామని అనంతరం 2000 పెంచామన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మార్చి నుండి 3000 చెల్లిస్తామని ఏడాదికి 500 చొప్పున 5000 రూపాయలు చెల్లించే బాధ్యతను తీసుకుంటాను అన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సాధించిందని ఎందుకు నిదర్శనంగా రాష్ట్రంలో మూడు కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని ఆయన తెలిపారు రాబోయే కాలంలో నాలుగు కోట్ల టన్నులకు పెంచి ఆలోచనలో ఉన్నామన్నారు. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అందులో భాగస్వామిగా పుట్ట మధును గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదేనని ఆయన ప్రజలకు సూచించారు. మంథని ప్రాంతానికి సంబంధించిన సమస్యలపై పుట్ట మధుకు పూర్తి అవగాహన ఉందని ఆయన తెలుపుతూ మధు ని గెలిపించాక ఒకరోజు మంథనిలో ఉండి 1000 కోట్ల నిధులు కేటాయించి అన్ని రకాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలే మాకు బాసులు: కేసిఆర్
- Advertisment -