కరీంనగర్, జనతా న్యూస్ :హుజురాబాద్ లోని ఏసీపీ సబ్ డివిజన్ స్థాయి నేరసమీక్ష సమావేశాన్ని శనివారంనాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి, హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంనందు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి మాట్లాడుతూ హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసు స్టేషన్ల వారీగా పెండింగులో ఉన్న కేసుల వివరాలు, వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వాటిల్లో పెండింగ్ లోగల కేసుల కారణాలు తెలుసుకుని త్వరితగతిన వాటిని దర్యాప్తుచేసి ముగించాలన్నారు. పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ ఓ లు పిటిషన్ మేనేజ్మెంట్ సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి కేసులైనా నెలల తరబడి పెండింగ్ లో ఉంచకూడదని, సరైన పద్దతిలో దర్యాప్తు జరిపి వీలైనంత త్వరగా సాక్షాదారాలను సేకరించి సంబంధిత కేసులను పూర్తి చేయాలనీ సూచించారు. నిత్యం నమోదయ్యే క్రిమినల్ కేసులతోపాటు, ఆర్ధిక నేరాలు, భూతగాధాలు, నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి అక్రమంగా భూ ఆక్రమణ చేసినట్లు వచ్చే ఫిర్యాదులు, హిస్టరీ షీటర్స్, రౌడీషీటర్స్ పై పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలన్నారు. భౌతిక నేరాలు, ప్రజలను మోసాలకు గురిచేసి కేసులు నమోదు కాబడిన వారిపై గల పెండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్ ల అమలు చేయుట, మొదలగు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏసిపిలు లక్కిరెడ్డి జీవన్ రెడ్డి (హుజురాబాద్), విజయ్ కుమార్ (సీసీఆర్బి), ఇన్స్పెక్టర్లు రమేష్ (జమ్మికుంట), రమేష్ (హుజురాబాద్), కిషోర్ (జమ్మికుంట రూరల్), సంతోష్ కుమార్ (హుజురాబాద్ రూరల్ ), ఎస్సైలు వంశీకృష్ణ (వీణవంక), రాజ్ కుమార్ (ఇల్లందకుంట), ఆరోగ్యం (సైదాపూర్), లక్ష్మారెడ్ది (కేశవపట్నం) ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.