Peddapelly : పెద్దపల్లి, జనతా న్యూస్: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో సంచలన సృష్టించిన హైకోర్టు దంపతుల హత్య కేసు నిందితుల్లో ఇద్దరికి బెయిల్ లభించింది. పెద్దపెల్లి కోర్టులో నిందితుల తరుపున న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ష్యూరిటీస్ సబ్మిట్ చేసిన అనంతరం ఇద్దరు నిందితులు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. ఇందులో ఏ 1 గా కుంట శ్రీనివాస్, ఏ2 గా చిరంజీవి ఉన్నారు. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి, మంథని రహదారిలో కల్వచర్ల సమీపంలో కారులో ప్రయాణిస్తున్న గట్టు వామన్ రావు, పీవీ నాగమణి దంపతులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో అరెస్టయిన ఒక్కొకరికీ బెయిల్ మంజూరు చేశారు. ఇప్పుడు మరో ఇద్దరికీ కూడా బెయిల్ వచ్చింది.
Peddapelly : పెద్దపల్లి: లాయర్ల హత్యకేసులో నిందితులకు బెయిల్
- Advertisment -