పెద్దపల్లి, జనత న్యూస్ : కలుషిత ఆహారం తిని ఇద్దరు కూలీలు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకొంది. మరో 17 మంది అస్వస్థకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లాలోని గౌరెడ్డి పేటకు చెందిన ఇటుకభట్టి కార్మికులు శనివారం కలుషిత ఆహారం తినడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో సమీప ఆసుపత్రికి వెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. మరో 17 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వీరి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొందరిని మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Peddapally : కలుషిత ఆహారం తిని ఇద్దరు మృతి
- Advertisment -