చెరువులోని నిర్మాణాల కూల్చివేత
అక్రమార్కుల గుండెల్లో మొదలైన దడ
పెద్దపల్లి-జనత న్యూస్
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడమే తడువుగా..హైడ్రా తరహాలో ఆపరేషన్ షురూ చేశారు పెద్దపల్లి జిల్లా అధికారులు. జిల్లా కేంద్రం శివారులోని బంధంపల్లి చెరువు శిఖంలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. లే అవుట్ లేని వెంచర్లు, హద్దు రాళ్లను తొలగించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశాల మేరకు ఆర్డీవో, ఇరిరేషన్, మున్సిపల్ అధికారుల సమన్వయంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. జేసీబీ లతో ఇక్కడి నిర్మాణాలను తొలగించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో కొన్ని రేకుల షెడ్లను గుర్తించిన అధికారులు..వాటిని కూల్చి వేయడంతో ఇతర ప్రాంతాల్లోని ఆక్రమణ దారుల్లో దడ మొదలైంది. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించిన వారెంతటి వారైనా చర్యలు తప్పవనే సంకేతాలిచ్చారు ఇక్కడి అధికారులు. జిల్లాలోని మిగతా చెరువుల్లో ఆక్రమణలు, నిర్మాణాలపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.