పెద్దపల్లి,జనత న్యూస్: వేసవి కాలంలో పిల్లలు ఉల్లాసంగా గడిపేందుకు రూమ్ టు రీడ్ సంస్థ ప్రతి రోజు ఒక కొత్త కథను ఆడియో రూపంలో అందిస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని క్యాంప్ కార్యాలయంలోని తన చాంబర్ లో రూమ్ టు రీడ్ ఉల్లాస సమయం పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆవిష్కరించారు.జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ వేసవి కాలంలో పిల్లలకు లెర్నింగ్ గ్యాప్ రాకుండా ఉండడానికి రూమ్ టు రీడ్ సంస్థ ఐవీఆర్ఎస్ ను వినియోగించుకొని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసిందన్నారు. పిల్లలకు ప్రతిరోజు ఉల్లాసవంతమైన కొత్త, కొత్త కథలు ఆడియో రూపంలో ఏర్పాటు చేయడం సంతోషకర మని కలెక్టర్ తెలిపారు.రూమ్ టూ రీడ్ ద్వారా పిల్లలు కొత్త, కొత్త కథలను వినాలని అనుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ 040-4520-9722 కు ఫోన్ చేయాలని, ప్రతి రోజూ ఒక కొత్త కథ పిల్లలకు టోల్ ఫ్రీ ద్వారా తెలియజేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డీ.మాధవి, రీడ్ 2 రూమ్ సంస్థ రాష్ట్ర హెడ్ నరసింహాచారి,పాఠశాల అకడమిక్ అధికారి పీఎం షేక్, రీడ్ 2 రూమ్ సంస్థ రాష్ట్ర ప్రతినిధులు తేజస్వి, మధు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి: వేసవిలో ‘రూమ్ టు రీడ్’
- Advertisment -