పెద్దపల్లి, జనతాన్యూస్: పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్ ఇచ్చిన ఇప్తార్ విందులో జిల్లా కలెక్టర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ఆచరించే ప్రార్థనలు, ఉపవాసం క్రమ శిక్షణను, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని అన్నారు. భగవంతుడు నేర్పిన సిద్ధాంతాలను పాటిస్తూ శాంతి యుతంగా ఇతరులకు మన వీలైన సహాయ, సహకారాలు చేస్తూ జీవనం కొనసాగించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు హనుమా నాయక్, రంగయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి: ఇఫ్తార్ విందులో కలెక్టర్ దంపతులు
- Advertisment -