పెద్దపల్లి, జనత న్యూస్: పెద్దపల్లి జిల్లాలోని మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కుప్ప కూలిపోయింది. జిల్లాలోని ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఓడేడ్ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించుకునేందుకు మానేరు వాగు పై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. 2016లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. మధ్యలో కాంట్రాక్టర్లు మారడం , నిధుల లేమి తదితర కారణాలతో వంతెన నిర్మాణం ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు.
పెద్దపల్లి: మానేరు నదిపై కూలిన వంతెన.. తప్పిన పెను ప్రమాదం..
- Advertisment -