కలెక్టరేట్ ఎదుట బాధితుడి నిరసన
కరీంనగర్ -జనత న్యూస్
భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదని వినూత్న నిరసనకు చేశాడో బాధితుడు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఇస్తారాకుపై పేడ వేసి..చుట్టూ కరెన్సీ నోట్లు ప్రదర్శిస్తూ..వాటిపై ఖాళీ మందు సీసాలు పెట్టి..అర్థనగ్న ప్రదర్శన చేశాడు. ప్రజావాణికి పదుల సార్లు దరఖాస్తు చేసుకున్నా, అధికారుల్లో స్పందన లేదని ఇలా వినూత్నన నిరసన ప్రదర్శన చేసి సమస్యను మీడియా దృష్టికి తీసుకెళ్లాడు. కరీంనగర్ రేకుర్తికి చెందిన దుర్గం మనోహర్ అనే బాధితుడు తన గోడు వెల్లబోసుకున్నాడు. కొత్తపల్లిలోని తన 22 గుంటల భూమిని తహసీల్దార్, ఆర్డీవోలు రిజిస్ట్రేషన్ చేయడం లేదని.. సంవత్సరాలుగా ఆఫీసుల చూట్టూ తిప్పించుకుని, వేధింపులకు గురి చేశారని ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో చేసేది లేక ఇలా కలెక్టరేట్ ఎదుట ఇలా అర్ధనగ్న ప్రదర్శన చేయాల్సి వచ్చిందని వాపోయాడు. రేకుర్తిలోని అనేక ప్రాంతాల్లో భూ కబ్జాలు జరుగుతున్నాయని, అనుమతులు లేకుండా నిర్మానాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం ఆందోళన చెందాడు. ఇకనైనా అధికారులు బుద్ది మార్చుకుని, బాధితులకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.