తిరుమల లడ్డు కల్తీ రిపోర్టు వెలుగులోకి రావడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, అపచారంపై పవన్ కళ్యాన్ దీక్ష తీసుకున్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సినీ నటులు సైతం పలు సందార్భాలో స్పందించారు. నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాన్..సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చకలు జారీ చేశారు. కాగా..సుందరం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో యాంకర్ వేసిన జోక్‌పై హీరో కార్తి మాట తీరు వైరల్ అయింది. దీనిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్ నొచ్చుకున్నారు. లడ్డుపై ఫంక్షన్‌లో జోకులేయడాన్ని తప్పు పట్టారు. అలా మాట్లాడే ప్రయత్నం చేయవద్దని సూచించడంతో హీరో కార్తి క్షమాపనలు చెప్పారు.
పవన్ సార్‌కు కొపమొచ్చింది !

- Advertisment -