Janasena: విజయవాడ, జనతా న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తీవ్ర జ్వరం వచ్చింది. గత నాలుగు రోజులుగా మండుటెండలో పిఠాపురంలో ప్రచారం నిర్వమించడంతో అస్వస్థతకు గురయ్యారు. బుధవారం అయన చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. పవన్ అనారోగ్యానికి గురికావడంతో బుధవారం తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను జనసేన పార్టీ రద్దు చేసింది. చికిత్స అనంతరం మళ్లీ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే పవన్ కు జ్వరం ఎక్కువగా ఉన్నందున కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరం అని పవన్ ను పరీక్షించిన వైద్యులు తెలిపారు. పవన్ కల్యాణ్ పిఠాపురం లోక్ సభ నుంచి బరిలో ఉన్న విషయం తెలిసిందే.
పవన్ కల్యాణ్ కు తీవ్ర జ్వరం..హైదరాబాద్ కు పయనం..
- Advertisment -