ఉత్తరాఖండ్: బాబా రాందేవ్ కు చెందిన ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలికి భారీ షాక్ తగిలింది. పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ దివ్య ఫార్మసీ తయారుచేసిన 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్ ఉత్తరాఖండ్ సర్కార్ ఏప్రిల్ 29 సస్పెండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర డ్రగ్స్ లైసెన్స్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుదోవ పట్టించేలా వారు ప్రకటన ఇచ్చినట్లు నిర్ధారణ కావడంతో డ్రగ్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ చట్టం 1954 ప్రకారం లైసెన్స్ రద్దు చేస్తున్న నిర్ణయం తీసుకుంది. పతంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్ ఉత్పత్తిలో స్వసారీ గోల్డ్, స్వసారీ వాటి, బ్రోంకోమ్, స్వసారీ ప్రవాహి. స్వసారీ ఆవలే, ముక్తావతి ఎక్స్ట్రా పవర్, బీపీ గ్రిడ్, మధు గ్రిట్, మధు నాశిని వాటి ఎక్స్ట్రా పవర్, లివా మృత్ అడ్వాన్స్ ,లివో గ్రిడ్, ఐ గ్రిడ్ గోల్డ్, పతంజలి దృష్టి ఐ డ్రాప్ వంటి ఉత్పత్తుల తయారీ లైసెన్స్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాష్ట్ర లైసె న్స్ అథారిటీలో తెలియజేసింది. కాగా ఇటీవల పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రజలను పట్టించే ప్రకటనలపై విచారించిన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసింది
Pathanjali: పతంజలి ఈ ఉత్పత్తుల లైసెన్స్ రద్దు
- Advertisment -