Wednesday, July 2, 2025

పార్టీల నేతల ఐక్యతా రాగం..!

కేంద్ర మంత్రితో మున్సిపల్‌ పాలక వర్గం..
ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలుపుకు కృషి : బండి సంజయ్‌

కరీంనగర్‌-జనత న్యూస్‌

వేరు వేరు పార్టీల ప్రజా ప్రతినిధులు, నేతలు ఒకే చోట కలిశారు. అభివృద్ధి మంత్రాన్ని జపించారు. కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని కలిశారు వివిధ పార్టీల కార్పోరేటర్లు. మేయర్‌ సునీల్‌ రావు ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, బీజేపే కార్పొరేటరు కేంద్ర మంత్రిని కలిసి ఘనంగా సత్కరించారు. ఇందులో మాజీ డిప్యూటీ మేయర్లు గుగ్గిళ్ల రమేశ్‌, అబ్బాస్‌ షమీ సహా 30 మందికిపైగా కార్పొరేటర్లు హాజరయ్యారు. స్మార్ట్‌సిటీ గడువు పొడగింపు, అమృత్‌ నిధుల మంజూరుపై కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ జన్మనిచ్చి ఇంతలా ఎదిగేలా చేసిన మున్సిపల్‌ రుణం తీర్చుకుంటానన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్‌. ఈ ఐదేళ్లలో ప్రభుత్వ, కార్పోరేటర్ల సాకారంతో తన మార్కు చూపిస్తానన్నారు. గతంలో అమృత్‌ `1 కింద రూ. 132 కోట్లు వచ్చాయని, ఇందులో కేంద్రం వాట రూ. 66 కోట్లని..దానివల్లనే నేడు నిరంతరం నీళ్లు ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద మొత్తం రూ. 934 కోట్లు మంజూరైతే….ఇందులో రూ. 765 కోట్లు ఇప్పటికే వచ్చాయని.మిగతా రూ. 176 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. ఇందులో స్టేట్‌ మ్యాచింగ్‌ గ్రాంట్‌ కింద రూ. 100 కోట్ల దాకా రావాల్సి ఉందని తెలిపారు. కేంద్రం నుండి రూ. 70 కోట్లు తీసుకొచ్చే బాధ్యత తనదని కార్పోరేటర్లకు హామీ ఇచ్చారు.
మళ్లీ అందరూ గెలవాలి
మున్సిపల్‌ పాలక వర్గ కాల పరిమితి ఇంకో 7 నెలల పాటు ఉందని.. కష్టపడి పనిచేయాలని.. మళ్లీ అందరూ గెలవాలని ఆకాంక్షించారు కేంద్ర మంత్రి బండి సంజయ్‌. ఎన్నికలప్పుడు మాత్రం తన పార్టీ గెలుపు కోసం పని చేస్తానని స్ఫష్టం చేశారు. గొడవలకు తావివ్వకుండా కలిసి పనిచేయాలని సూచించారు. పేరు కోసమో, మీడియా కోసమో కాకుండా, ప్రజల కోసం సభలో చర్చించాలని.. ప్రణాళిక రూపొందించాలని పాలక వర్గానికి సూచించారు. ప్రజలకు మంచి మెసేజ్‌ వెళ్లేలా కృషి చేయాలన్నారు. అభివృద్ధి కోసం మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ లను కలిసి చర్చిస్తానని, నిధులు తీసుకొచ్చే బాధ్యత తాము తీసుకుంటామని భరోసా ఇచ్చారు బండి సంజయ్‌.
మున్నూరు కాపుల ఘన సత్కారం
నగరంలోని మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళంలో పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంయ్‌. కాపువాడ శివాలయం నుండి భారీ ర్యాలీతో వచ్చారు. దారి పొడవునా పూలు చల్లుతూ బండి సంజయ్‌ కు స్వాగతం పలికారు. ఓపెన్‌ టాప్‌ జీపుఎక్కి అందరికీ అభివాదం చేస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. సభలో ఆయన మాట్లాడారు. మున్నూరు కాపు సమాజం తనకు అండగా నిలిచిందని, తనకు సాకారం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page