కరీంనగర్-జనత న్యూస్
పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని..కాని ప్రజా ప్రభుత్వాన్ని పడగొడుతాం, విడగొడుతాం అని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కలసి చేసిన వ్యాఖ్యలతో తాము చూస్తూ ఊరుకోలేక పోయామన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ వన మహోత్సవానికి వచ్చిన ఆయన..ప్రతిపక్ష పార్టీలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 3న ఎన్నికైన తమ ప్రభుత్వం అప్పటి నుండే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ఉంటే..ఇప్పటి ఆ నలుగురు కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ మిగిలే వారు కాదన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కాపాడుతామని స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. తాము నీతి తప్పడం లేదని, ప్రతిపక్షాలు నీతి తప్పాయని..ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్.