ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పుపై ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ గతంలో రోహిత్ శర్మ కెప్టెన్ ఉండగా.. హర్థిక్ పాండ్యాకు మార్చిన విషయం తెలిసిందే. దీనిపై రోహిత్ ఫ్యాన్స్ విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఐదుసార్లు ఛాంపియన్ గ నిలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని హార్థిక్ పాండ్యాకు ఇవ్వడం రోహిత్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వారు చేసిన ట్రోల్స్ పై తొలిసారిగా హార్థిక్ పాండ్యా స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇందులో కొత్తేమీ లేదు.. అవసరం అయితే రోహిత్ నాకు సాయం చేస్తాడు. ముంబై ఇండియన్స్ ఈ స్టేజికి తీసుకొచ్చింది రోహిత్ శర్మనే. ఇప్పుడు దానిని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను నేను తీసుకున్నా.. ఈ సీజన్ మొత్తంలో రోహిత్ నాకు అండగా ఉంటాడు..’ అని అన్నాడు.
రోహిత్ ఫ్యాన్స్ విమర్శలపై స్పందించిన పాండ్యా
- Advertisment -