తెలుగు సీనిమాల్లో ఎక్కువగా నటించి ప్రేక్షకుల ఆదర అభిమానాలను చూరగొన్న జూనియర్ ఎన్టీఆర్..పాన్ ఇండియా మూవీ వైపు దృష్టి సారించారు. ఇప్పటికే ‘దేవర సినిమా పూర్తయి ఈ నెల 27న రిలీజ్‌కు సిద్దమైన విషయం తెలిసిందే. దీంతో పాటు వార్`2 బాలీవుడ్ సినిమా చేస్తున్నారు. ప్రశాంత్ నీల్‌తో మరో భారీ పాన్ ఇండియా మూవీలో నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్దమైనట్లు తెలుస్తుంది. దేవర సినిమా ప్రమోషన్‌ను తమిళనాడు లోని చెనైలో చేయడం చూస్తే..తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, ఇతర రాష్ట్రాల ప్రేక్షకుల్లో ముద్ర వేసుకునే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది.
పాన్ ఇండియా మూవీ వైపు జూనియర్ ఎన్టీఆర్..

- Advertisment -