బలహీన వర్గాలకు అండ కాంగ్రెస్ పార్టీ జెండా
కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్
మంథని, జనతా న్యూస్: మంథని పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ ఓ బి సి సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ పాల్గొన్నారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండా కాంగ్రెస్ పార్టీ జెండా అని ఇందిరమ్మ రాజ్యం తోనే బడుగు బలహీన వర్గాలు బాగుపడతారని విద్యార్థుల ఉద్యమ ఆత్మ బలిదానమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కారణమని అలాంటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బి ఆర్ ఎస్ పార్టీ బంగారు తెలంగాణ చేస్తా అని మాటలు చెప్పి పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించారని ఎన్నికలు వస్తున్నాయని వివిధ పథకాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారని ఈ పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఉండి దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని ముఖ్యంగా బహుజన విద్యార్థులు రాష్ట్ర రాజధానిలో కడుపు మార్చుకొని ఉన్న ఆస్తులు అమ్ముకొని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయేమో అని గంపడంత ఆశతో చదువుకుంటున్న ఇప్పటివరకు ఒక్క పరీక్ష కూడా సరిగా నిర్వహించలేదనిఇందిరమ్మ రాజ్యం వస్తనే ఇంటింటికి రక్షా అని అందుకోసమే ఈ ప్రాంతంలో మంథని నియోజకవర్గంలో ఎంతోమంది బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ ఎంతోమంది బహుజన నాయకులను తయారుచేసిన నాయకుడు మాజీ మంత్రి ఏఐసిసి కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు ని తిరిగి మంథని నియోజకవర్గంలో శాసన సభ్యుడిగా గెలిపించుకుంటామని ఇందిరమ్మ రాజ్యాన్ని సాధించుకొని ప్రతి ఇంటికి 6 గ్యారంటీలను వివరించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి బహుమతిగా ఇస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంథని మండల బీసీ సెల్ అధ్యక్షులు ఐలి శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జి నాయకులు మాచిడి రవితేజ గౌడ్ ముత్తారం మండల అధ్యక్షులు అల్లం కుమారస్వామి రామగిరి మండల అధ్యక్షులు బండారి సదానందం బీసీ సెల్ నాయకులు బండారి ప్రసాద్ జిల్లా కార్యదర్శి గట్టు విజయ్ బీసీ సెల్ నాయకులు నాగుల రాజయ్య ఊరకొండ గణేష్ గడ్డం రాజా గౌడ్ కోరబోయిన కృష్ణవంశీ తాళ్లపల్లి సత్యనారాయణ ఎండి సాహిబ్ గుంజపడుగు అరుణ్ తదితరులు పాల్గొన్నారు