పొలిటికల్ హీట్..
తిరుమల లడ్డు తయారీపై ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. నెయ్యికి బదులుగా ఇతర పదార్థాలను వాడి లడ్డు తయారు చేశారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపనలు దూమారాన్ని రేపాయి. దీనిపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ వేసి నిజా నిజాలు తేల్చాలని డిమాండ్ చేసిన షర్మిల..హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్‌ఆర్ సీపీ రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా..భారత్‌లోనే కాదు, ప్రపంచలోనూ తిరుపతి లడ్డు ఫేమస్. అలాంటి పవిత్ర గల లడ్డు తయారీలో గతంలో వినియోగించిన పదార్థాలపై నిగ్గు తేల్చి హిందు మనోభావాలు, పవిత్రను కాపాడాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. దీనిపై ఏసీ సీఎం చంద్రబాబు నుండి రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
తిరుమల లడ్డు తయారీపై..

- Advertisment -