ముగింపు వేడుకకు హాజరు కానున్న కేంద్ర మంత్రి
కరీంనగర్-జనత న్యూస్
నగరంలో బుధవారం తిరంగా సైక్లింగ్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి, అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి. కరీంనగర్ వావిలాలపల్లి అల్ఫోర్స్ విద్యా సంస్థ కార్యాలయంలో వారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు వావిలాలపల్లి అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్ గ్రౌండ్ నుండి సైక్లింగ్ ర్యాలీ ప్రారంభమై..తెలంగాణ చౌరస్తా వరకు చేరుకుంటుందని తెలిపారు. ప్రజల్లో దేశ భక్తిని ఇనుమడిరపచేయడమే కాకుండా, సైక్లింగ్ పట్ల ప్రత్యేక ఆసక్తి పెంచాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపడతున్నట్లు తెలిపారు. ఆరో తరగతి నుండి పై తరగతి విద్యార్థులు ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉదయం ఆరున్నరకు గ్రౌండ్‌లో ర్యాలీ ప్రారంభమౌతుందని, సకాలంలో రావాలని విద్యార్థులకు వారు సూచించారు. తెలంగాణ చౌరస్తాలో తిరంగా ర్యాలీ ముగింపు కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరౌతున్నట్లు వారు తెలిపారు. ఉదయం ఏడున్నరకు నిర్వహించే ముగింపు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని వారు కోరారు. పూర్తి వివరాలకు 93982 30614 నందు సంప్రదించగలరని తెలిపారు. ఈ సమావేశంలో సంఘ భాద్యులు, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.