Wednesday, September 18, 2024

స్వచ్ఛతపై ఎమ్మెల్యే అసంతృప్తి

పరిశుభ్రత-పచ్చదనంలో భాగస్వాములు కావాలి
మానకొండూర్‌ వ్యాపారస్తులకు ఎమ్మెల్యే సూచనలు
ఆసుపత్రి సందర్శన, జ్వరాల నివారణకు చర్యలు
తిమ్మాపూర్‌ పూలే బాలికల పాఠశాల సందర్శన..
విద్యార్థులతో కలెక్టర్‌, ఎమ్మెల్యే భోజనం

మానకొండూర్‌/ తిమ్మాపూర్‌-జనత న్యూస్‌
మానకొండూర్‌ నియోజక వర్గ కేంద్రంలో అపరిశుభ్రతపై సీరియస్‌ అయ్యారు ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ. జిల్లా అధికారులతో కలసి గ్రామాన్ని సందర్శించిన ఆయన..చెత్తా`చెదారం, మురుగు నీరు, పిచ్చి మొక్కలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఫైర్‌ అయ్యారు. ప్రత్యేక అధికారి, ఇతర అధికారుల తీరుపై అంసతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి డీఆర్డీడీఏ పీడీ శ్రీధర్‌, ఎంపీడివో, తదితర మండల అధికారులు, వ్యాపారస్తులతో సమావేశమై పలు సూచనలు చేశారు. గ్రామంలోని ప్రతీ వాడలోని పరిస్థితిపై తనకు అవగాహన ఉందన్నారు. మేజర్‌ గ్రామ పంచాయతీ అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయిందని..ప్రస్తుతం మురికి కూపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వారం పాటు పనిచేసినా కనీసం 50 శాతం కూడా చెత్తను తొలగించలేక పోయారన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో నిధుల కొరత, తదితర ఇబ్బందులను అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. బుధవారం ఒకే రోజు 15 గ్రామాల నుండి ట్రాక్టర్లను తెప్పించి, 85 మంది సిబ్బందితో పారిశుధ్య పనులు చేయించినట్లు స్ఫెషల్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ తెలిపారు. 270 వీధి దీపాలు పని చేయడం లేదని గుర్తించి, కొత్తవి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.కరీంనగర్‌ – వరంగల్‌ ప్రధాన రహదారికి ఇరువైపుల అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను స్వచ్చందంగా తొలగించాలని వ్యాపారస్తులకు ఎమ్మెల్యే సూచించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన
మానకొండూర్‌ ప్రాథమిక ఆరోగ్యం కేద్రాన్ని జిల్లా కలెక్టర్‌ పమేల సత్పతి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత తో కలసి సందర్శించారు ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, జ్వరాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఈ సందదర్భంగా వైద్యులకు కలెక్టర్‌, ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. గ్రామాల్లో విష జ్వరాలు ప్రభల కుండా అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు. నియోజక వర్గ కేంద్రంలో స్టడీ సర్కిల్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని కలెక్టర్‌కు సూచించారు ఎమ్మెల్యే. ప్రభుత్వ పాఠశాలో అనువైన స్థలాన్ని పరిశీలించాలని కోరారు.
తిమ్మాపూర్‌ బీసీ బాలికల గురుకుల సందర్శన
తిమ్మాపూర్‌ మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్‌ పమేల సత్పతి, అసిస్టెంట్‌ కలెక్టర్‌తో కలసి సందర్శించారు ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ. వంట గది, సరుకుల నాణ్యత, గదులను తనిఖీ చేసి..విద్యార్థులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లో విద్యార్థులకు సబ్జెక్ట్‌ల పట్ల అవగాహణ ఎంత మేరకు ఉందనేది ప్రశ్నల వేసి సమాదానాల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలసి కలెక్టర్‌, ఎమ్మెల్యే భోజనం చేశారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page