Saturday, July 5, 2025

కారును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. ఐదుగురు దుర్మరణం..

చెన్నై:  ఓ శుభకార్యానికి వెళ్లివస్తున్న కారును పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఈ విషాధ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరుపూర్ జిల్లాలో ధారాపురం వద్ద ఓ కారును పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరొకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా ఈ ప్రమాద ఘటనపై సీఎం స్టాలిన్ స్పందించారు. మరణించిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page