- స్వచ్చంధంగా ఉద్యోగులకు లీవ్స్..
- ఇచ్చేసిన పలు ప్రైవేట్ సంస్థలు
- స్వచ్చంధ సెలవులకు మరికొన్ని సంస్థల అనుమతి
న్యూఢిల్లీ, జనత న్యూస్: అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకొని పలు రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 22ను సెలవు దినంగా ప్రకటించాయి. బీజేపీ,దాని మిత్ర పక్షాలు అధికారంలో ఉన్న స్టేట్స్ ఇప్పటికే ఈ నిర్ణయం తీసుకున్నాయి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఉద్యోగులకు ఐచ్చిక సెలవుల ఆప్షన్ ఇచ్చేశాయి. మరోవైపు ప్రాణ ప్రతిష్టా మహోత్సవ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించేలా ఆదేశాలివ్వాలని ఇప్పటికే కొందరు హైకోర్ట్ లలో పిటిషన్స్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా జనవరి 22ను ఆఫ్ డే సెలవు దినంగా ప్రకటించాయి. ఎయిమ్స్-భువనేశ్వర్ తో పాటు ఇతర కేంద్ర సంస్థలు ఇప్పటికే ఆఫ్ డే లీవ్ ను అనౌన్స్ చేశాయి. అయితే మొదట ఆఫ్ డే సెలవును ఇస్తున్నట్లు ప్రకటించిన ఎయిమ్స్-ఢిల్లీ పాలకవర్గాలు మాత్రం ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాయి. అయితే దేశంలోని పలు ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థలు ప్రాణ ప్రతిష్టా మహోత్సవాన్ని ప్రత్యేక్ష ప్రసారం చేయాలని నిర్ణయించాయి. ముంబయి బాంద్రా-వర్లీ బ్రిడ్జ్ పైనైతే శనివారం సాయంత్రం నుంచే స్క్రీన్ లను ఏర్పాటు చేసి అక్కడి పబ్లిక్ ఈ క్రతువును స్వాగదీస్తున్నారు. అలాగే ఆలయ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకోవాలని సిరమ్ ఇన్స్టిట్యూట్ అదార్ పూనవాల నిర్ణయించింది.