Tollywood : సినీ నటి నమిత భర్తకు సూరమంగళం పోలీసులు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కౌన్సిల్ విభాగానికి చైర్మన్ పదవి కోసం నమిత భర్త వీరేంద్ర చౌదరి లంచం తీసుకున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారరు. తమిళనాడులోని ముత్తురామన్ జిల్లాలోని అమ్మాపాళయం జాకీర్ ప్రాంతానికి చెందిన గోపాల్ స్వామి వద్ద ఆ పదవి కోసం రూ. 50 లక్షలు తీసుకున్నాడు. అయితే ఆ పదవిలో ఇటీవల నమిత భర్త చౌదరి నియమితులయ్యారు. దీంతో తాను మోసపోయినట్లు గోపాల్ స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు హాజరు కావాల్సిందిగా నమిత భర్త వీరేంద్ర చౌదరికి నోటీసులు పంపారు. ఈ కేసులో అక్టోబర్ 31న కౌన్సిల్ ప్రెసిడెంట్ దుశ్యంత్ ను అరెస్టు చేశారు.
సినీ నటి నమిత భర్తకు నోటీసులు.. కారణం ఇదే..
- Advertisment -