- కోనారావు పేటలో సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టీమేటం
- మార్పు కోరుకుని ప్రజలు ఆగమయ్యారు
- ఐదేళ్లలో బండి సంజయ్ ఐదు కొత్తలు తేలేదు
సిరిసిల్ల,జనత న్యూస్: బ్యాంకులకు వెళ్లి రూ. 2 లక్షల రుణాలు తెచ్చుకొండ్రి…డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. అధికారం చేపట్టి 150 రోజులవుతున్న సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఆగస్టు 15 వరకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని దేవుళ్ళ మీద ఒట్లు వేస్తున్నారని…సీఎం రేవంత్ రెడ్డి నీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తామని నీ భార్య పిల్లలపై ఒట్టు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టీమేటమిచ్చారు.గురువారం కోనారావుపేట మండల కేంద్రంలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల రోడ్ షో నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని,దొంగల మాటలు నమ్మి మార్పు కోరుకుని అగమయ్యారని.. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.చీకటి ఉంటేనే… వెలుగు విలువ తెలుస్తుందని,మళ్లీ కేసీఆర్ కావాలంటే ప్రజలు 12 ఎంపీ సీట్లు అప్పజెప్పితే కేసీఆర్ సర్కారు మళ్లీ ఏడాదిలో వస్తుందన్నారు. పదేళ్ళలో దేశ ప్రజలకు మోడీ సర్కారు చేసింది ఏం లేదని, చేసింది ఏం లేదని చెప్పలేకనే ఇప్పుడు దేవుళ్ళ పేరుతో రాజకీయం చేస్తున్నారన్నారు.కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఐదేళ్లలో ఐదు కొత్తలు తెలేదని ఏ ఊరికైనా వచ్చాడా..బండి ఏం చేశాడని ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు. బండి సంజయ్ ఒక్కనాడైన పార్లమెంట్ కు పోయి ప్రజా సమస్యలపై అడిగాడా ఐదేళ్లలో ఏం చేశావని అడిగితే సమాధానం ఎం చెప్పలేడన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమారును ఎంపీగా గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.