Friday, July 4, 2025

రాజకీయాలు ఆసక్తి లేదు: విశాల్

తమిళనాట సినీ ఇండస్ట్రీలో రాజకీయ చర్చలు తీవ్రమయ్యాయి. ఇటీవల స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ కొత్త పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొంత మంది హీరోలు రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో మరో స్టార్ హీరో విశాల్ గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయింది. తను కూడా రాజకీయాల్లోకి వస్తున్నాడని, కొత్త పార్టీ పెడుతారని కొందరు పోస్టులు పెట్టారు. అయితే ఈ వార్తలపై హీరో విశాల్ స్పందించారు. తాను ప్రస్తుతం రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎక్స్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేశారు. ‘ నాకు ఇంత గుర్తింపు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. నాకు చేతనైనంత సాయం చేస్తా.. దేవీ ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకున్నా.. విద్యార్థులను చదివిస్తున్నా.. అందరూ అనుకుంటున్నట్లు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం లేదు. కానీ ఆ ఇంట్రెస్ట్ లేదు. కాలం నిర్ణయిస్తే ప్రజల కోసం పోరాడుతా’ అని వివరించారు. దీంతో విశాల్ రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ వచ్చినట్లయింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఫేమస్ అయిన విశాల్ ‘రత్నం’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page