- కవ్వంపెల్లి యువ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి రమేష్ గౌడ్ విమర్శలు
మానకొండూర్ నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి, జనతా న్యూస్ : బీఆర్ఎస్ పార్టీలో కుప్పలు తెప్పులుగా ఇతర పార్టీలోని వారు చేరుతున్నారని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని, అయితే వారంతా టీఆర్ఎస్ కు చెందని వారేనని కవ్వంపెల్లి యువ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి రమేష్ గౌడ్ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడతూ 2018 తరువాత జరిగిన స్థానిక ఎన్నికలలో మెజారిటీ స్థానాలను టీఆర్ఎస్ గెలిచిందని, ఇతర పార్టీల్లో గెలిచిన వారిని సైతం నయానో.. భయనాలకు గురి చేసి ఆ పార్టీలో కలుపుకున్నారని అన్నారు. నిప్పటి వరకు ఇతర పార్టీలకు నాయకులు, కార్యకర్తలు కూడా లేరని ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు ఇతర పార్టీల్లో నుంచి కుప్పులు తెప్పలుగా వస్తున్నారని ఎలా ప్రచారం చేస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ ఇతర పార్టీ అనుకుని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చి చేరుతున్నారని చెప్పుకుంటే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. మానకొండూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ను ఎక్కువగా ఆదరిస్తున్నారని, ఎక్కడ కాంగ్రెస్ గెలుస్తుందోనని భయపడి బీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీలో ఉన్న నాయకులను చేర్చుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. కానీ వారు కాంగ్రెస వైపే చూస్తన్నారని చెప్పారు. వచ్చే ది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మానకొండూర్ నియోజకవర్గంలో కవ్వంపల్లి సత్యనారాయణ గెలవడం ఖాయం అని కత్తి రమేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఊరు, వాడా కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఇప్పటికే కాంగ్రెస్ గెలిచిపోయిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.