తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం నుంచి నామినేషన్లు మొదలుకానున్నాయి. దీంతో ఎన్నికల కోడ్ మరింత కఠినంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈరోజు నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13న వాటిని స్క్రూటీ చేసి 15న ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. నామినేషన్ల స్వీకరణ కోసం రాష్ట్రంలోని ఆయా జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్టీవో, తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసే వ్యక్తి తనతో పాటు 4గు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. నామినేషన్ వేసేకంటే ముందురోజే అభ్యర్థి తనకు సంబంధించిన వివరాలు సంబంధిత కార్యాయలంలో సమర్పించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీకి చెందిన వారు రూ.5 వేలు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు నామినేషన్ సందర్భంగా ఎలాంటి అవాంచయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేటి నుంచి తెలంగాణలో నామినేషన్లు
- Advertisment -