Wednesday, July 2, 2025

నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి :పమేలా సత్పతి

  • కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి

కరీంనగర్, జనతా న్యూస్2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికల కొరకు అభ్యర్థులు నామినేషన్ లను దాఖలు చేసినప్పుడు ఆర్వోలు ప్రతి డాక్యుమెంట్ ను క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పర్వం శుక్రవారం నుండి ప్రారంభం కావడంతో మొదటి రోజు కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో జరిగే నామినేషన్ ల ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నామినేషన్ దాఖలుకు వచ్చే అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు 2బి లను రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఉచితంగా అందించాలని, నియోజక వర్గానికి సంబంధించిన ఓటరు జాబితా లను అభ్యర్థులు పరిశీలించుకోవడానికి వీలుగా పోలింగ్ కేంద్రం వారీగా జాబితాను అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా ఆన్లైన్ ద్వారా కూడా పరిశీలించుకునే ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

నామినేషన్ పత్రాల నమోదులో అభ్యర్థులకు సిబ్బంది సహకరించి ప్రతి కాలం నమోదు చేసేలా చూడాలని, ఒకవేళ ఏదైనా కాలంలో చెప్పాల్సింది ఏమి లేనప్పుడు లేదు/వర్తించదు అని ఖచ్చితంగా రాసేలా చూడాలని సూచించారు. సెక్యూరిటీ డిపాజిట్ అనంతరం రిటర్నింగ్ అధికారికి అభ్యర్థి నామినేషన్ పత్రాలను సమర్పించినప్పుడు అనెగ్జర్-19, ఫార్మాట్-26 అఫిడవిట్, బ్యాంక్ ఖాతా, కుల ధ్రువీకరణ, ఫోటోలు, ఇతర నియోజకవర్గానికి చెందిన వారైతే వారి ఓటు వివరాలు తెలిపే సర్టిఫైడ్ కాపి, అభ్యర్థి పోటి చేసే పార్టీ గుర్తులను తెలియజేశార లేదా, మొదలైనవి క్షుణ్ణంగా పరిశీలించాలని, నామినేషన్ స్వీకరణ అనంతరం స్క్రూటీనికి సంబందించిన సమయాన్ని అభ్యర్థులకు తెలియజేయాలని అన్నారు.

నామినేషన్ సమర్పించిన అనంతరం అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ క్యాండిడేట్ హ్యాండ్ బుక్ మొదలైనవి అందించాలని, నామినేషన్ తో పాటు అభ్యర్థి సమర్పించిన పత్రాల వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పలు విభాగాలను పరిశీలించారు. నామినేషన్ నాటి నుండి అభ్యర్థుల ఖర్చులను రికార్డులలో నమోదు చేయాలని, ఈ రికార్డుల నిర్వహణ ఎన్నికలు ముగిసే వరకు కోనసాగించాలని ఆదేశించారు. పార్టీలకు చెందిన వారి ఖర్చులను పార్టీ పేరుతో ఏర్పాటు చేసిన రిజిస్టర్ లో, ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించిన ఖర్చులను షాడో రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సి పి అభిషేక్ మొహంతి మానకొండూర్, కరీంనగర్, హుజూరాబాద్, రిటర్నింగ్ అధికారులు లక్ష్మీ కిరణ్, కె. మహేశ్వర్, ఎస్. రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page