Gangula Kamalakar : జనతాన్యూస్, కరీంనగర్ : కరీంనగర్ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచి రూపు రేఖలు మార్చేశానని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా మంత్రి గంగుల కమలాకర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన కలెక్టరేట్ ఎదుట మీడియాతో మాట్లాడారు. మీ ఇంటికి బంధువులు వస్తే వారిని అడగండి.. కరీంనగర్ ఇప్పుడు రాత్రిళ్లు జిగేల్ మంటూ మెరుస్తుంది. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. అంతకుముందు సన్నిహితులు, కార్యకర్తుల, నేతల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వరకు వెళ్లారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి గంగుల కమలాకర్ నామినేషన్ పత్రాలను అందించారు.
