ప్రయివేటు ఆసుపత్రుల్లో సేవల రేట్లు..
స్కానింగ్, ఇమేజ్ సెంటర్లలో ఛార్జీలు ప్రదర్శించాలి
జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆదేశాలు
కరీంనగర్-జనత న్యూస్
ప్రయివేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవల వివరాలు రోగులకు తెలిసేలా బోర్డుపై ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి నిర్వాహకులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ సుజత ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు (అల్లోపతీ, అయూష్, యూనాని, సిద్ధ) తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు . జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం వైద్య బృందం జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లను తనిఖీ చేసినట్లు తెలిపారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆక్ట్ ప్రకారం బయోమెడికల్ వెస్ట్ మేనేజ్మెంట్ ఇతర ఆసుపత్రుల్లో పత్రాలను పరిశీలించామని, వారికి కొన్ని సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్, ఇమేజింగ్ సెంటర్లు తప్పనిసరిగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఛార్జీల పట్టిక బోర్డులను ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఆసుపత్రిలో డాక్టర్ల వివరాలు, సిబ్బంది వివరాల్ని అందులో చూపాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ, పొల్యూషన్ నో అబ్జెక్షన్ సెర్టిఫికట్, బయోమెడికల్ వెస్ట్ మేనేజ్మెంట్ , మున్సిపాలీటీ రూల్స్ నియమ, నిబందనలను పాటించాలి. నిబంధనల పాటించని ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్, ఇమేజింగ్ సెంటర్లపై తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుర్తింపులేని ఆసుపత్రులను గుర్తించి, వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రులపై చర్యలు
- Advertisment -