- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపెల్లి వినోద్ రావు
మనకొండూరు నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి, జనతా న్యూస్: మనకొండూరు నియోజక వర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ గెలుపు పక్కా అని, ఆయన గెలుపును ఎవరు ఆపలేరని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన పెల్లి వినోద్ కుమార్ అన్నారు.
ఆయన మంగళ వారం మనకొండూర్ లో విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు మన బడి లో భాగంగా పాఠశాలలకు నూతన భవన నిర్మాణలు చేపట్టిందన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం తో పాటు అల్పాహారం, నాణ్యమైన విద్య ను అందిస్తుందని, అలాగే పలు మెడికల్ కాలేజీలు, పలు ఆసుపత్రులలో, వైద్య సౌకర్యాలు మెరుగు పరచడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్య రంగాల మెరుగు కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని అన్నారు. శాంతి భద్రతలు రాష్ట్రంలో అదుపులో ఉన్నాయని, బీ ఆర్ ఎస్ పాలన పట్ల ప్రజలు ఆనందంగా వున్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు గడ్డం నాగరాజు, దరువు ఏళ్లన్న, దోనె అశోక్, డీ. శ్రీనివాస్, బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు జీ వీ రామ కృష్ణ రావు మంకొండూర్ జెడ్పీటీసీ, సర్పంచ్ లు తాళ్ళ శేఖర్ గౌడ్, రొడ్డ పృధ్వీరాజ్, తదితరులు ఉన్నారు.