హైదరాబాద్ :
ఎపుప్పడో జారీ చేసిన కార్డులు, వాటిని ఇప్పటికీ జాగ్రత్తగా భద్రపర్చుకుని ఉంటారు. పోయి ఉంటే ఆన్‌లైన్ నుండి డౌన్‌లోడ్ చేసుకుని రేషన్ షాప్‌కు వెళ్లి బియ్యం తీసుకుంటున్నారు. ఇక ఆరోగ్య శ్రీ వైద్య చికిత్సకోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందుల నుండి ప్రస్తుత తెలంగాణ సర్కారు తప్పించనుంది. త్వరలో కొత్త కార్డులను అందుబాటులోకి తీసుక రానుంది. డిజిటల్ కార్డు జారీ కోసం పాయిలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని ఆయా నియోజక వర్గాల్లో చేపట్టే సర్వే ఈ నెల 3 నుండి 7 వరకు కొనసాగనుంది. నియోజక వర్గంలో ఒక పట్టణ, మరో గ్రామాన్ని ఎంపిక చేసి ఇంటింటి సర్వే చేయనున్నారు. 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 238 ప్రాంతాల్లో అధికారులు పరిశీలించనున్నారు. సిబ్బంది వెళ్లి వివరాలు కలెక్ట్ చేసుకుంటారు. అయితే..కుటుంబ సభ్యులు అనుమతిస్తేనే ఫోటో సేకరిస్తారు. లేని ఫక్షంలో ప్రభుత్వం వద్ద ఉన్న ఫోటో, ఇతర వివరాలతో కార్డులు రూపొందించనున్నారు. పాయిలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన వివరాల సేకరణ తరువాత ప్రభుత్వం లోటుపాట్లను పరిశీలించే అవకాశాలుంటాయి. ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టకుండా..గతంలో నమోదైన వివరాలతోనే డిజిటల్ కార్టును తయారు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే వివిధ పథకాల్లో లబ్ధి పొందిన వివరాలను క్రోడికరించుకుని కార్డులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రులు ప్రకటించారు.
వచ్చే నెల నుండి డిజిటల్ కార్డులు

- Advertisment -