కరీంనగర్, జనతా న్యూస్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు సరికొత్త సంచలన పాలసీ జీవన్ఉత్సవ్ ని ప్రారంభించింది. కరీంనగర్ డివిజనల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎస్ వి ప్రసాదరావు పాలసీని ప్రారంభించి మాట్లాడుతూ అన్నివర్గాల, అన్ని వయసుల పాలసీదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎల్ఐసి ఈ పాలసీని రూపొందించిందని పేర్కొన్నారు. ఈ పాలసీ ప్రవేశంతో భారతీయ బీమా రంగంలో సంచలనం నమోదు కానుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
తక్కువ కాలం ప్రీమియం చెల్లించి జీవితాంతం ఆర్థిక ప్రయోజనాలు పొందే అద్భుతమైన పాలసీయని, ప్రతి 1000 రూపాయలకి 40 రూపాయల గ్యారెంటీ అడిషన్స్ తో ఖచ్చితమైన ఆదాయాన్ని జీవితాంతం ఇవ్వగలిగిన ఏకైక పాలసీ భారతీయ భీమా రంగంలో మరొకటి లేదని తెలిపారు.
కనిష్ట బీమా మొత్తం 5 లక్షలుగా ఉన్న ఈ పాలసీని మూడు నెలల పసికందు నుండి మొదలుకొని 65 సంవత్సరాల వయస్సు వరకు తీసుకోవచ్చని, ప్రీమియం మాత్రం 5 నుండి గరిష్టంగా 16 సంవత్సరాలు మాత్రమే చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. ప్రీమియం చెల్లించిన తర్వాత సర్వైవల్ బెనిఫిట్స్ కింద ఆదాయ ప్రయోజనం ప్రతి సంవత్సరం భీమా మొత్తంలో 10% పాలసీదారుడు జీవించి ఉన్నంతకాలం చెల్లించబడుతుందని ఇలాంటి ప్రయోజనం ఇంతవరకు లేదని తెలిపారు.
ఉదాహరణకి ఒక 25 సంవత్సరాల వ్యక్తి 12 సంవత్సరాల కాలంలో కేవలం 10 లక్షలు ప్రీమియం చెల్లించి తనకు 38 సంవత్సరాల వయసు నుండి ప్రతి సంవత్సరం ఒక లక్ష చొప్పున అతను జీవించు ఉన్నంత కాలం లాభాన్ని స్వీకరించవచ్చు. ప్రతి సంవత్సరం ఈ లక్ష రూపాయల మొత్తాన్ని తీసుకోకుండా వాయిదా వేస్తే దానిమీద 5.5 శాతం చక్రవడ్డీతో కలిపి 100 సంవత్సరాల చివరి నాటికి సుమారు 2 కోట్ల 60 లక్షల సొమ్ము చెల్లించబడుతుంది అంటే ఈ పాలసీలో ఉన్న ఆర్థిక ప్రయోజనం ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.వడ్డీతో కలిపి జమ అయిన మొత్తములో గరిష్టంగా 75% తీసుకొన వచ్చును. ఆ రోజు నుండి మిగిలిన మొత్తము పై 5.5% చక్రవడ్డీ కొనసాగుతుందనీ తెలిపారు.
యాక్సిడెంట్ బెనిఫిట్ సౌకర్యము ఉందని తెలిపారు. పాలసీ కాల పరిమితిలో లోన్ సౌకర్యం కలదనీ, పాలసీ కాలపరిమితి తరువాత, అనగా రెగ్యులర్ ఆదాయము మొదలైన తరువాత కూడా లోన్ సదుపాయం కలదని తెలిపారు. ఇతర వివరాలకు సమీప ఎల్ఐసి కార్యాలయాన్ని కానీ ఏజెంట్ను కానీ వికాసాధికారినీ కానీ సంప్రదించాల్సిందిగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ ఎంఆర్కె శ్రీనివాస్, సేల్స్ మేనేజర్ రాజేష్ ఖన్నా, వికాసాధికారుల సంఘం నాయకులు వాసుదేవ రెడ్డి, ఏజెంట్ల లియాఫి సంఘం నాయకులు రంగారావు లతో పాటు అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు