Netanna Bharosa: హైదరాబాద్, జనతా న్యూస్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. చేనేత కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే. నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని, నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ఆదుకోరా? అని ఆయన ప్రశ్నించారు నేతన్నల బతుకులు ఆగమయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయని మండిపడ్డాడు. గతంలో మాదిరిగా చేనేత కార్మికులకు చేతినిండా పనులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలా ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు చేనేత సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నేత కార్మికుల కోసం త్వరలో కొత్తగా ‘నేతన్న భరోసా’ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. చేనేత పవర్ లూం కార్మికుల సంక్షేమం కోసం కొత్త పథకాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇండియన్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటులో పార్క్ పునరుద్ధరణకు కలెక్టర్ల కృషి చేయడంతో పాటు కొత్త సాంకేతిక వస్త్ర విధానాన్ని ఆవిష్కరించాలని , కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని చేనేత సంఘాలకు పని కల్పించే చర్యలు చేపట్టిందని ఇప్పటికే రూ. 53 కోట్ల విలువైన వస్త్రాన్ని కొనుగోలు చేసిందని ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు.