Nellore : విజయవాడ, జనతా న్యూస్ : ఏపీలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన ఘటనలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. నేరం జరిగిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టామని, నిందితులంతా నకిలీ నోట్ల మార్పిడి ముఠాకు చెందిన వారని తెలిపారు. ఇప్టపి వరకు ఏడుగురిని పట్టుకున్నామని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. హారన్ కొట్టారనే నెపంతో ఆర్టీసీ డ్రైవర్లు బీఆర్సింగ్, శ్రీనివాసరావులపై 14 మంది దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంఘటన జరిగిన వెంటనే నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. కాగా ఇందులో ప్రధాన నిందితుడు సుధీర్ కోసం వెతుకుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
Nellore : బస్ డ్రైవర్ దాడి ఘటనలో నిందితుల అరెస్టు
- Advertisment -