ఇల్లంతకుంట, జనతా న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10 జీపీఏ సాధించిన పదో తరగతి విద్యార్థులందరికీ రూ. 2,016 నజరానాను అయ్యన్న గారి హరికృష్ణ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో చదివి మంచి మార్కులు సాధించాలని, ఇప్పటి నుంచే ఒక లక్ష్యం ఎంచుకొని ముందుకు సాగి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పేరు నిలబెట్టాలని సూచించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన గాలిపెల్లి గ్రామానికి చెందిన హరికృష్ణ రెడ్డి 2016 సంవత్సరం నుంచి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రూ.2,016 ప్రోత్సాహకాన్ని విద్యార్థులకు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
