- అశోక్ నగర్ ఆలయంలో అంగరంగ వైభవంగా వాసవి జయంతోత్సవాలు
- భారీగా హజరైన ఆర్యవైశ్య కుటుంబాలు
కరీంనగర్,జనత న్యూస్:కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్ ఆలయంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతోత్సవాలను ఆలయ ట్రస్ట్ నిర్వహాకులు శనివారం నయనానందకరంగా నిర్వహించారు.ఉదయం అభిషేకం,వాసవి హోమం,అష్టోత్తర శత వాసవి పారాయణం, డోలోత్సవం బ్రహ్మశ్రీ పారువెళ్ల ఫణిశర్మ సారథ్యంలో నిర్వహించారు.పూజల అనంతరం 1500 మంది భక్తులు మహాప్రసాదం స్వీకరించారు. వాసవి దేవాలయం నుండి మొదలైన రథయాత్ర టవర్ సర్కిల్ మీదుగా ప్రకాశం గంజ్ వరకు కోలాటాలు, కళాకారుల సందడితో వైభోవపేతంగా అమ్మవారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అన్ని అభ్యుదయ సంఘాల నాయకులు, యువజనసంఘాల నాయకులు , వైశ్య అనుబంధ సంఘాల నాయకులు మహిళలు పాల్గొన్నారు.
ఐక్యత చాటిన ఆర్యవైశ్యులు..
శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతోత్సవాల్లో నగరంలోని ఆర్యవైశ్యులు కుటుంబ సమేతంగా హజరై ఐక్యతను చాటారు.ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్,కోశాధికారి బొల్లం శ్రీనివాస్,సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య,సేవాకార్యక్రమ కన్వీనర్ తాటిపెల్లి సుభాష్,కార్యదర్శి నార్ల శ్రీనివాస్, తొడుపునూరి దశరథం,ఆలయ డైరెక్టర్లు పెద్ది మహేశ్, కొండ శ్రీనివాస్,మంచాల గౌరినాథం,ఎలగందుల వీరేశం,ఎరవెల్లి శంకర్,నకిరకొమ్ముల శంకర్ లింగం, , గజవాడ శ్రీనివాస్,పల్లెర్ల శ్రీనివాస్,రామిడి శ్రీనివాస్,పాత కృష్ణమూర్తి,చింత సురేశ్,పాల్తేపు శ్రీనివాస్,ఎల్లెంకి ఆంజనేయులు,రాచమల్ల ప్రసాద్,యాంసాని అశోక్,పాల్తేపు మల్లికార్జున్, జవ్వాజి కమలాకర్,పడమతింటి తిరుపతి,కొంజర్ల నారాయణ,మోటూరి ఆంజనేయులు,కట్కూరి వెంకటేశ్,పడకంటి శ్రీనివాస్,చిట్టుమల్ల వేణుగోపాల్, రేణికుంట శ్రీధర్,సామ అశోక్,రాచమల్ల శ్రీనివాస్, తొడుపునూరి తిరుపతి పాల్గొన్నారు.