దసరా నవాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఈ క్రమంలో దుర్గాదేవి మండపాల వద్ద దాండియా నృత్యాలతో సందడిగా మారింది. సౌత్ లో కంటే నార్త్ లో ఎక్కువగా గార్భా వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. గార్భాతో పాటు దాండియా గుజరాతి నృత్యాలే. సాయంత్రం అమ్మవారికి హారతి ఇచ్చిన తరువాత లయబద్ధంగా మహిళలకు కర్రలతో దరువు చేస్తూ వృత్తాకారంలో తిరుగుతూ నృత్యం చేస్తారు. ఇందులో రంగురంగుల కర్రలు ఉపయోగించి ఆడడం పలువురిని ఆకట్టుకుంటుంది. దాండియా పాటల్లో ఎక్కువగా కృష్ణ లీలే ఉంంటుంది.
నవరాత్రి ఉత్సవాలను జైళ్లో ఉన్న మహిళా ఖైదీలు ఘనంగా నిర్వహించుకున్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సెంట్రల్ జైళ్లో దసరా సందర్భంగా గార్భా, దాండియా వేడుకలను నిర్వహించుకున్నారు.ఇక్కడి జైళ్లో ఉన్న మహిళా ఖైదీలు గార్భా ఆడుతూ అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు. ప్రతీ ఏడాది ఇక్కడ మహిళా ఖైదీలు దాండియా ఆడుతూ తమ బాధలను, కష్టాలను మరిచిపోతుుంటారు. జైలు అధికారులు వీరికి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఒతలు తెలుపుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది.
https://x.com/ANI_MP_CG_RJ/status/1715377607603355930?s=20