నేషనల్ హైవే ల వెంట సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టనుంది కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగా హమ్ సఫర్ పాలసీని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. జాతీయ రహదారు లకు ఇరువైపులా టాయిలెట్స్, బేబీ కేర్ గదులతో పాటు దివ్యాంగులకు వీల్‌చైర్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, పార్కింగ్ స్థలాలు, తాగునీటి సదుపాయాలు కల్పించనున్నారు. రహదారి వెంట వెళ్తున్న ప్రయాణీకులు, డ్రైవర్లకు సదుపాయాలు కల్పించడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయల ఏర్పాటుకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గడ్కరీ తెలిపారు. ప్రయాణీకులు, డ్రైవర్లకు సదుపాయల కల్పన వల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు.
నేషనల్ హైవేల్లో హమ్ సఫర్ పాలసీ

- Advertisment -