ఇల్లంతకుంట జనవరి 24 (జనతా న్యూస్) ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలలు మరియు టిఎస్ మోడల్ స్కూల్ కేజీబీవీ తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇల్లంతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎస్సై డి సుధాకర్ మాట్లాడుతూ ఆడపిల్లలే ఇంటికి వెలుగని సమస్యల కు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు బాలికలు కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని మహిళలు ఆర్థికంగా ఎదగాలని అప్పుడే మహిళా సాధికారిక సాధ్యమవుతుందని అన్నారు మైనర్లకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వీలులేదని కానీ వారు తమ ఉపాధ్యాయులతో గాని తల్లిదండ్రులతో గాని వచ్చి ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు దీనికి చిగురు మామిడిలో తను ఉండగా జరిగిన ఒక సంఘటన చెపుతూ పోకిరి వెధవలకు శిక్షపడేలా చేసినట్లు పేర్కొన్నారు బాలికలు కష్ట సమయాల్లో బాలిక హెల్ప్‌లైన్ 1098 కు గాని పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 10 0 కు గాని ఫోన్ చేయవచ్చునని తెలిపారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం హేమలత మాట్లాడుతూ బాలికలు బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని అన్నారు సీనియర్ ఉపాధ్యాయులు తమ తమ సందేశాలను ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయుడు వి మహేష్ చంద్ర గర్ల్స్ ఫ్రెండ్లీ టీచర్ ఎం మంజుల స్వప్న టి మోహన్ రెడ్డి అనిల్ కుమార్ లతోపాటు అంగన్వాడీ టీచర్లు రహీమున్నీసా బేగం బైరి అరుణ ఒగ్గు విజయలక్ష్మి మహిళా కానిస్టేబుల్ విద్యార్థులు పాల్గొన్నారు
ఇల్లంతకుంటలో జాతీయ బాలిక దినోత్సవం
- Advertisment -
