Narenra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ఆ పార్టీ నేతలు వరుస ఆందోళనకు పిలుపునిచ్చారు. మార్చి 31 భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా మంగళవారం ప్రధాని ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఢిల్లీ పోలీసులు ముందే ప్రధాని నివాసం వద్ద 144 సెక్షన్ విధించారు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ను ఈడీ మంగళవారం ప్రశ్నించనుంది మార్చి 28 వరకు ఆయనను ఈడి కస్టడీలోనే ఉండనున్నారు.
Narenra Modi: ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద 144 సెక్షన్
- Advertisment -