కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా నగునూరి రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.2023 – 2025 సంవత్సరముకు గాను ఆదివారం నిర్వహించిన కరీంనగర్ పట్టణ ఆర్య వైశ్య సంఘం ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడంతో మిగిలిన అభ్యర్థి అయిన నగునూరి రాజేందర్ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ప్రకటించారు.
దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని మహాసభ ఉపాధ్యక్షుడు కన్న కృష్ణ, ఎన్నికల కన్వీనర్ రాచమల్ల ఆంజనేయులు, కో కన్వీనర్ ఏ వి మల్లికార్జున్, ఎన్నికల న్యాయ సలహాదారు బండ శివ కుమార్, ఎన్నికల పర్యవేక్షకులు చంద రాజు, శివనాథుని శ్రీనివాస్ అభ్యుదయ సంఘాల అధ్యక్షులు, ప్రముఖ వైశ్యుల సమక్షంలో అందజేశారు. .
అనంతరం నగునూరి రాజేందర్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను గౌరవం దక్కింది అని,
ఆర్య వైశ్యుల ఐక్యతకు కృషి చేస్తూ పేద ఆర్య వైశ్యులకు అన్ని విధాలా అందుబాటులో ఉంటు నావంతు సహయ సహకారాలు అందిస్తానని తెలిపారు..ఈ ఎన్నికల్లో నాకు సహకరించిన ఆర్య వైశ్య పెద్దలకు శ్రేయోభిలాషులకు బందు మిత్రులకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు.