బాధ్యతాయుత పార్టీల్లో ఉన్న నేతల వివాదాస్పద వ్యాఖ్యలు ఆందోళనలకు దారి తీస్తున్నాయి. మొన్న ఢల్లీి బీజేపీ నాయకులు తన్వీ దర్ సింగ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్త ఆందోళనలకు దారి తీశాయి. రాహుల్ గాంధీ బయటకు వస్తే చంపేస్తామని..జేపీ నేత తన్వీందర్ సింగ్ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ బిట్టు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ‘దేశంలోని నంబర్ వన్ టెర్రరిస్టు’ అని అన్నారు. బిట్టుతో పాటు, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్, ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. తాజాగా కేంద్ర మంత్రి వవ్నీత్ సింగ్ బిట్టుపై తెలంగాణలోని ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంఛలన వ్యాఖ్యలు చేశారు. తన్నీర్ బిట్టు తల తెచ్చిన వారికి తన ఆస్తిని బహుమానంగా ఇస్తానని ప్రకటించారు. ఇలా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతల పరస్పర వ్యాఖ్యలు ఆందోళనలకు కలిగిస్తున్నాయి. ప్రజలకు శాంతి, సామరస్యాన్ని పంచాల్సిన నేతలు, ఇలా రాజ్యాంగ విరుద్ధంగా పరస్పర ఆరోపనలు చేసుకోవడాన్ని ఆక్షేపిస్తున్నారు పలువురు సామాజిక వేత్తలు.
పరస్పర వివాదాస్పద సంఛలన వ్యాఖ్యలు..

- Advertisment -