- అరగంటకుపైగా భేటీ
కరీంనగర్, జనతా న్యూస్:ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిశారు. ఈరోజు మధ్యాహ్నం కరీంనగర్ వచ్చిన రామారావు పటేల్ ఎంపీ కార్యాలయానికి వచ్చి సంజయ్ తో అరగంటకు పైగా సమావేశమయ్యారు. ముథోల్ తో బండి సంజయ్ కు మొదటి నుండి ప్రత్యేక అనుబంధముంది. బైంసా అల్లర్ల నేపథ్యంలో నియోజకవర్గంలోని హిందుత్వవాదులపై ఎంఐఎం మూకలు దాడులు చేసి పలు ఇండ్లను ధ్వంసం చేసిన సందర్భంలో బండి సంజయ్ పలుమార్లు అక్కడికి వెళ్లి హిందుత్వ వాదులకు అండగా నిలిచారు. బాధితులకు అన్ని రకాల సహాయ సహాకారాలు అందించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ముథోల్ లో పాదయాత్ర చేయడంతోపాటు భారీ బహిరంగ సభ నిర్వహించారు.అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హెలికాప్టర్ లో ముథోల్ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రామారావు పటేల్ మర్యాదపూర్వకంగా బండి సంజయ్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

పార్లమెంట్ సమావేశాలు సోమవారానికి వాయిదాపడిన నేపథ్యంలో కరీంనగర్ వచ్చిన బండి సంజయ్ ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంపీ కార్యాలయంలో గడిపారు. నియోజకవర్గంలోని పలువురు కార్యకర్తలను కలిశారు. అనంతరం ఎలాబోతరం, ఇరుకుల్ల వెళ్లారు. ఎలబోతారం పోలింగ్ బూత్ అధ్యక్షులు ఆడెపు శ్రీకాంత్ తండ్రి ఆడెపు సుధాకర్ మరణించడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇరుకుల్లలో ఇటీవల మరణించిన బీజేపీ కార్యకర్త ఇగుర్ల రవి కుటుంబాన్ని పరామర్శించారు
