హైదరాబాద్ :
మూసి నిర్వాసితుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్ఫెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లోని నిర్వాసితుల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు అధికారులు కార్యచరణ చేపట్టారు. నిరాసిత కుటుంబాలను కలుస్తూ ప్రత్యామ్నాయ డబుల్ బెడ్ రూం ఇంటితో పాటు రూ. 25 వేల ప్రోత్సాహాన్ని అందించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే చిరు వ్యాపారులు, కూలీలు తమకు ఉపాధి కల్పించేలా సమీప ప్రాంతాల్లో ఇండ్లను కేటాయించాలని అధికారులను కోరుతున్నట్లు తెలుస్తుంది. దీంతో హిమాయత్ నగర్, అంబర్ పేట తదితర మండలాల పరిధిలోని వారికి సమీపంలోని నార్సింగ్ ప్రాంతంలో ఇండ్లు కేటాయిస్తున్నారు. అయితే..మరో 60 శాతం ఇండ్లను ఖాళీ చేయించే పనిలో పడ్డారు అధికారులు. వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా..చిన్న చిన్న షెడ్లు, ఇండ్లు కట్టుకుని జీవిస్తున్న నిరుపేద వర్గాలు డబుల్ బెడ్ రూం ఇండ్లకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తుండగా..సుమారు రూ. 50 లక్షల నుండి రూ. కోటికి పైగా ఖర్చు పెట్టి భవనాలు నిర్మించుకున్న వారు తాము ఖాళీ చేసేది లేదని తెగేసి చెబుతున్నారు. వారికి ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తుంది.